తెలుగుబాల శతకం | TeluguBala Satakam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

తెలుగుబాల శతకము
                -జంధ్యాల పాపయ్య శాస్త్రి 

తెలుగుబాల శతకం | TeluguBala Satakam | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

తెలుగుదనమువంటి తీయందనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 1

కష్టపెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టపెట్టబోకు నాన్నపనులు
తల్లిదండ్రులన్న దైవసన్నిభులురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 2

దేశసేవకంటె దేవతార్చన లేదు
స్వార్థపరతకంటె చావులేదు
సానుభూతికంటె స్వర్గంబు లేదురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 3

అందమైన సూక్తి అరుణోదయంబట్లు
బాలమానసముల మేలుకొల్పు
సూక్తిలేని మాట శ్రుతిలేని పాటరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 4

రక్తిలేనియాట రాత్రి నిద్దుర చేటు
భక్తిలేని పూజ పత్రి చేటు
నీతిలేని చదువు జీతాల చేటురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 5

వినయ, మార్జవంబు, వీరత్వ, మనుకంప
దీక్ష, సత్యసూక్తి , దేశభక్తి
మండనమ్ములివ్వి మంచి విద్యార్థికి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 6

మదము, దొంగతనము, మంకుబుద్ధి, అసూయ
విసుగు, పిరికితనము, విరగబాటు
సహజ గుణము లివ్వి చవట విద్యార్థికి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 7

మొరటువానితోడ సరసమాడుట రోత
పిరికిపంద వెంట నరుగ రోత
నీతిలేని వాని నేస్తంబురోతరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 8

ఎద్దునెక్కె శివుడు, గ్రద్దనెక్కె విష్ణు
హంసనెక్కె బ్రహ్మ అందముగను
బద్దకంపు మొద్దు బల్లపై నెక్కెరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 9

బడికి నడువలేడు, పాఠాలు వినలేడు
చిన్న పద్యమప్ప జెప్పలేడు
రాజురాజు బిడ్డరా నేటి విద్యార్థి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 10

పరమ సుందరంబు ఫలములు, సంసార
విషమహీజమునకు వెలయు రెండు
సాధుసంగమంబు, సత్కావ్యపఠనంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 11

అతిథిజనుల వీడి అభ్యాగతుల వీడి
దేవతలకు నిడక తినెడివాని
చెప్పనగు ధరిత్ర జీవన్మృతుం డని
లలితసుగుణజాల! తెలుగుబాల!! 12

జనులకొరకు ధర్మశాలలు గట్టించి
బీదసాద నెంతొ యాదరించి
పేరుగన్న కర్మవీరుడే మృతజీవి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 13

హంసలందు బకము హాస్యాస్పదంబగు
మణుల గాజుపూస గణుతి గనదు
చదువురాని మొద్దు సభల రాణింపదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 14

జవ్వనంబు గలిగి, సౌందర్యమును గల్లి,
కలిమి గలిగి, విద్య గనని జనులు
గంధరహిత కింశుక ప్రసూనంబులు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 15

బ్రతికినన్నినాళ్ళు ఫలము లిచ్చుట గాదు
చచ్చి కూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరువులే గురువులు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 16

జూలు చుట్టుకొన్న వాల మల్లార్పిన
కొండకొమ్ము మీద కూరుచున్న
కరుల గుండె లదర గర్జించునా నక్క
లలితసుగుణజాల! తెలుగుబాల!! 17

తగిలినంత మేర దహియించుకొని పోవు
చెడ్డవాని చెలిమి చిచ్చువోలె
మంచి వాని మైత్రి మలయమారుత వీచి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 18

అది పయోధి దోషమడుగున మణులిడి
తృణగణమ్ము తల ధరించుటనిన
మణుల విలువ పోదు తృణముల కది రాదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 19

ఫణిని మట్టుబెట్టి బాలు గాపాడిన
ముంగి జంపె నొక్క మూర్ఖురాలు
మందమతులకెపుడు ముందుచూపుండదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 20

సాధు సంగమమున సామాన్యుడును గూడ
మంచి గుణములను గ్రహించుచుండు
పుష్పసౌరభంబు పొందదా దారంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 21

అడవి గాల్చు వేళ నగ్నికి సాయమై
నట్టి గాలి దీపమార్పి వేయు
బీదపడిన వేళలేదురా స్నేహంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 22

మధుకరంబు వచ్చి మకరందమును ద్రావు
సరసిజంబు క్రింద తిరుగు కప్ప
కాంచలేరు జడులు కావ్య సౌందర్యంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 23

విరుల జేరి హరుని శిరసు నెక్కిన చీమ
చందమామతోడ సరసమాడె
ఉత్తమాశ్రయమున నున్నతస్థితి గల్గు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 24

నీట కుంజరమును నిలబెట్టు మొసలిని
బైట పిచ్చి కుక్క పరిభవించు
స్థానబలమఖండ శక్తి ప్రదమ్మురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 25

రావణుండు జనకరాట్పుత్రి గొనిపోవ
సింధువునకు గలిగె బంధనమ్ము
ఖలుని తప్పుచెంత గలవారలకు ముప్పు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 26

మద్యమునకు భ్రాంతి, మార్తాండునకు కాంతి,
క్షితికి క్షాంతి మందమతికి క్లాంతి,
సజ్జనులకు శాంతి సహజధర్మంబులు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 27

కొంపగాలు వేళ, గునపంబు చేబూని
బావి త్రవ్వ నేమి ఫలము గలుగు
ముందుచూపు లేని మూర్ఖుండు చెడిపోవు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 28

ప్రాతదైన మాత్ర ప్రతిది సాధువుగాదు
క్రొత్తదనుచు విసరికొట్టరాదు
అరసి మంచిచెడ్డ సరసుండు గ్రహియించు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 29

పాలకడలిలోన ప్రభవించు మాత్రాన
హాలహలము మధురమగుట గలదె
కులము ననుసరించి గుణములు రావురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 30

రాజహంస వికచ రాజీవవని చేర
కాకి గూడు, గ్రద్ద కాడు చేరు
ఎట్టి గుణమువారి కట్టి యాశ్రయమబ్బు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 31

కోకిలమ్మ చేసికొన్న పుణ్యంబేమి
కాకి చేసుకొన్న కర్మమేమి
మధురభాషణమున మర్యాద ప్రాప్తించు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 32

కాకికోకిలమ్మలేక వర్ణమ్ములే
సుంత తెలియదయ్యె నంతరంబు
గుట్టు బైటపడియె గొంతెత్తినంతనే
లలితసుగుణజాల! తెలుగుబాల!! 33

పైడి గద్దెమీద పట్టంబు కట్టిన
సిగ్గులేని కోతి మొగ్గలేసె
అల్పమతికి పదవి హస్యాస్పదంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 34

కొలిమినిడిన, సాగగొట్టిన నరికిన
కంచన మ్మొకింత కష్టపడదు
కుందనంబు కుందు గురిగింజతో తూయ
లలితసుగుణజాల! తెలుగుబాల!! 35

మూడు దశలు విత్తమునకు _ దానమ్ము, భో
గమ్ము మరియు నాశనమ్మనంగ
మొదటి రెండు లేమి మూడవ దశ వచ్చు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 36

పెట్టెనిండ కూడబెట్టిన సిరులకు
తగిన రక్షణమ్ము త్యాగ గుణము
అలుగు పారి చెరువు జలముల కాపాడు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 37

ముందువెనుక గనుము, తొందరపడకుము
ఆపదలకు మౌఢ్యమాస్పదమ్బు
అరసి చేయువాని వరియించు సంపదల్
లలితసుగుణజాల! తెలుగుబాల!! 38

అరుగుకొలది సురభియగును చందనయష్టి
తరుగుకొలది రసము గురియు చెరకు
ఘనులు ప్రకృతి విడరు కష్టాలలో గూడ
లలితసుగుణజాల! తెలుగుబాల!! 39

ఇనుడు వెలుగునిచ్చు ఘనుడు వర్షమునిచ్చు
గాలి వీచు చెట్లు పూలుపూచు
సాధుపుంగవులకు సహజలక్షణమిది
లలితసుగుణజాల! తెలుగుబాల!! 40

చిన్ననాటి చెలిమిచే నారికేళంబు
మధురజలము లొసగు మానవులకు
నరులమేలు ఘనుల మరువరు బ్రతుకెల్ల
లలితసుగుణజాల! తెలుగుబాల!! 41

మదము గురియుచున్న మత్తేభములపైన
సింహశిశువు దుమికి చీల్చివైచు
వరపరాక్రములకు వయసుతో పనిలేదు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 42

హస్తిరాజ మెంత హరికిశోరం బెంత
గహనమెంత అగ్ని కణమదెంత
దేహయష్టి కాదు తెజస్సు ముఖ్యంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 43

వీడు పరులవాడు వాడు నావాడని
అల్పబుద్ధి తలచు నాత్మయందు
సాధుపుంగవులకు జగమే కుటుంబంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 44

నరుడు మెచ్చెనేని నారాయణుడు మెచ్చు
దీనులందు దేవదేవుడుండు
మానవార్చనంబె మాధవార్చనమురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 45

క్రౌంచపక్షి బాధ గన్న వాల్మీకిలో
కరుణరసము పొంగి పొరలిపోయె
రసము పొంగి పొంగి రామాయణంబయ్యె
లలితసుగుణజాల! తెలుగుబాల!! 46

బాదరాయణుండు భారతమ్మునుజెప్ప
గంటమూని వ్రాసె గజముఖుండు
ఘనతగన్న కవికి గట్టి వ్రాయసకాడు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 47

గౌతమీ తరంగణీ తరంగములకు
తెలుగు భంగిమములు తెలిపినాడు
ఆంధ్రకవులకెల్ల అన్నయ్య నన్నయ్య
లలితసుగుణజాల! తెలుగుబాల!! 48

హోమవేది ముందు సోమయాజియెగాని
చేయి దిరిగినట్టి శిలిపి యతడు
తిక్కనార్యు పల్కు తియ్యదేనెలు చిల్కు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 49

స్నిగ్ధ కావ్యరసము సీసాలలో నింపి
రసిక శేఖరులకు నొసగినాడు
సిద్ధహస్తుడోయి శ్రీనాథకవిరాజు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 50

భాగవతము వ్రాసె బమ్మెర పోతన్న
సహజపాండితీ విశారదుండు
పలుకుపలుకులోన నొలికెరా ముత్యాలు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 51

కలము చేతపట్టి కావ్యమ్ము రచింయిచె
హలము చేతబట్టి పొలము దున్నె
కలము హలములందు ఘనుండురా పోతన్న
లలితసుగుణజాల! తెలుగుబాల!! 52

ఖడ్గమూని శతృకంఠాలు ఖండించె
'గంట' మూని వ్రాసె కావ్యములను
తెలుగుసవ్యసాచి మన కృష్ణరాయుడు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 53

అష్టదిగ్గజముల నాస్థానమున నిల్పి
రాజ్యమేలె కృష్ణరాయ విభుడు
తుంగభద్ర నాడు పొంగులెత్తినదిరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 54

పల్లె పైరుగాలి పరిరంభణమ్ములు
స్నిగ్ధమధుర వాగ్విజృంభణములు
పాండురంగ విజయు పదగుంభనమ్ము
లలితసుగుణజాల! తెలుగుబాల!! 55

రామలింగడంచు రామకృష్ణుం డంచు
జుట్టు జుట్టు పట్టి కొట్టుకొనిరి
లింగ కృష్ణులందు లేదురా భేదంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 56

ఐనవారినెల్ల అవహేళనము చేసి
కానివారితోడ కలియరాదు
కాకి, కేకులందు కలిసి కష్టములందె
లలితసుగుణజాల! తెలుగుబాల!! 57

పొంచి, బుజ్జగించి, పొగడి టక్కరిమూక
మంచివారి మోసగించుచుండు
కాకి జున్ను ముక్క కాజేసెరా నక్క
లలితసుగుణజాల! తెలుగుబాల!! 58

సాటివానితోడ జగడమాడగరాదు
తీరువులకు పరుల జేరరాదు
కొంటెకోతి గడ్డకొట్టె పిల్లుల నోట
లలితసుగుణజాల! తెలుగుబాల!! 59

ఆశపోతువాని కానంద మది కల్ల
ఆపదలకు లోభమాకరమ్ము
పసిడి కంకణమ్ము బ్రాహ్మణు వంచించె
లలితసుగుణజాల! తెలుగుబాల!! 60
బావి నీటిలోన ప్రతిబింబమును చూపి
సింహమును శశంబు సంహరించె
తగు నుపాయమున్న తప్పు నపాయంబు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 61

రత్నమాల పుట్ట రంధ్రాన పడవైచి
కాకి త్రాచుపాము గర్వ మడచె
పరుల నిట్లు యుక్తిపరులు సాధింతురు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 62

మదగజమ్ము వీడి, మనుజుని పోనాడి,
నక్క చచ్చె వింటినారి కొరికి
హాని సంభవించు నతిసంచయేచ్చచే
లలితసుగుణజాల! తెలుగుబాల!! 63

తనకు తగని పిచ్చి పనులకు పోనేల
అడుసు త్రొక్కి కాలు కడుగుటేల
కోతి మేకు పీకి కోల్పోయె ప్రాణాలు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 64

కష్టసాధ్యమైన కార్యమ్ము నెరవేర్ప
నైకమత్యమే మహాబలమ్ము
పావురములు వలను పైకెత్తుకొని పోవె
లలితసుగుణజాల! తెలుగుబాల!! 65

'కందుకూరి' 'పానుగంటి' కొమర్రాజు'
'చిలకమర్తి' 'గిడుగు' 'చెళ్ళపిళ్ళ'
తెలుగు దిగ్గజములు 'చిలుకూరి' 'వేదము'
లలితసుగుణజాల! తెలుగుబాల!! 66

కలిమి గలుగ నేస్తకాండ్రు వేలకు వేలు
కలిమి లేక చెలిమికాండ్రు లేరు
లేమివేళ మిత్రులే ప్రాణమిత్రులు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 67

భారతం బనంగ పంచమ వేదంబు
దాతయనగ తొమ్మిదవ గజంబు
ధరణి నల్లుడన్న దశమ గ్రహంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 68

ఆటలాడబోకు మల్లరి జట్టుతో
వేటలాడ ఓకు వెర్రి ప్రజల
మాటలాడబోకు మర్యాద విడనాడి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 69

వెతకి వెతకి వారి వీరి కావ్యాలలో
గతికి గతికి కడుపు కక్కురితికి
అతుకులతుకు కుకవి బ్రతుకేమి బ్రతుకురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 70

కలము పట్టగానె కవిశేఖరుడు గాడు
గద్దె నెక్కగానె పెద్ద గాడు
శాటి గట్టగానె సన్యాసిగాడురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 71

కట్టుకొన్న సతిని నట్టేటిలో ముంచి
కన్నవారి నోట గడ్డకొట్టి
సభలకెక్కు వాడు చచ్చు పెద్దమ్మరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 72

బోసితాత శాంతి, బోసు వీరుని క్రాంతి
త్యాగధనుల శోణిత స్రవంతి
భరతమాత దాస్యబంధాలు బాపెరా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 73

నదులయందు గంగ, ననలందు సంపెంగ
సతుల సీత, గ్రంథతతుల గీత,
కవులయందు గొప్ప కాళిదాసుండురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 74

ధనము గలుగుచోట ధర్మంబు కనరాదు
ధర్మమున్న చోట ధనము లేదు
ధనము ధర్మమున్న మనుజుండె ఘనుడురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 75

ధనము గలిగి దానధర్మాలు చేయని
నరుడు ధరనకెంతొ బరువు చేటు
సాగరములు గావు, శైలంబులును గావు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 76

ప్రాకి ప్రాకి చీమ బహుయోజనములేగు
ఎగురకున్న గ్రద్ద యెచటికేగు?
సాధనమున కార్యసాఫల్య మొనగూడు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 77

మంచిచెడ్డ లేదు, మర్యాద కనరాదు,
దేవులాట కడుపు తిండికొరకు,
పశువు, పురుష పశువు ప్రాణబంధువులుగా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 78

విశ్వమందు గలుగు విషరాజములయందు
అతిభయంకరంబు హాలహలము
ఘోరమంతకంటె క్రూరుని చిత్తమ్ము
లలితసుగుణజాల! తెలుగుబాల!! 79

మెదడు పాడుచేయు, మేనెల్ల చెడగొట్టు,
కీర్తి నపహరించు, నార్తి పెంచు,
క్రూరజనుల మైత్రి కుష్ఠురోగమ్మురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 80

తక్షకునకు విషము దంష్ట్రాగ్రమున నుండు
మక్షికమున కుండు మస్తకమున
నీచునకు విషంబు నిలువెల్ల నుండురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 81

సత్ప్రవర్తనంబు, సౌఖ్యంబు, మర్యాద,
మంచివారి పొందు మనకు నిచ్చు
కలుషమతుల పొందు కలహాలు గొనితెచ్చు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 82

తరువులకు తుపాను, గిరులకు వజ్రమ్ము
పద్మములకు హిమము భయము గొల్పు
సజ్జనులకు దుష్టసంగంబు భయమురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 83

సమయమెపుడు గడచు సన్మార్గులకు శాస్త్ర
చర్చలందు బుధసమర్చలందు
ఖలుల కాలమేగు కలహాల జూదాల
లలితసుగుణజాల! తెలుగుబాల!! 84

మనసు, మాట, క్రియ సమైక్యమ్ములగు శిష్ట
మానవులకు, దుష్టమానవులకు
తలపు వేరు, భాషితము వేరు, క్రియవేరు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 85

మాంద్యమెల్ల దీర్చు, మంచి పేరు వెలార్చు
మనసు కలక దేర్చు, ఘనత కూర్చు
సాధుమైత్రి సకల సౌభాగ్య సంధాత్రి
లలితసుగుణజాల! తెలుగుబాల!! 86

నష్టమధికమైన, కష్టాలు కలిగిన,
సిరి తొలంగి చనిన, మరణమైన,
ధర్మపథ మొకింత తప్ప రుత్తమజనుల్
లలితసుగుణజాల! తెలుగుబాల!! 87

మదముచేత వెలుగు మత్తేభరాజంబు
జవముచేత వెలుగు సైంధవంబు
వినయగుణముచేత విద్యార్థి వెలుగురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 88

అంతరిక్షమునకు అర్కుండు రత్నంబు
భవమునకు ముద్దు బాలకుండు
చదువుకొన్న వాడు సభకు రత్నంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 89

ప్రభువు పూజలందు పట్టణమ్మందున
రాజు పూజలందు రాజ్యమందు
చదువుకొన్న వాని జగమెల్ల పూజించు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 90

దొరలు దోచలేరు, దొంగలెత్తుకపోరు
భ్రాతృజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యాధనంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 91

తల్లివోలె పెంచు, తండ్రి కైవడి గాంచు,
కాంత కరణి మిగుల గారవించు
ఖ్యాతి మించు విద్య కల్పవృక్షంబురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 92

నలున కాగ్రహంబు గలిగిన వెలివేయు
హంస నబ్జవ విహారమునకు
క్షీరనీరభేద శేముషిం జెరచునా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 93

పరులకొరకె నదులు ప్రవహించు, గోవులు
పాలుపిండు, చెట్లు పూలుపూచు,
పరహితమ్ముకంటె పరమార్థ మున్నదా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 94

కోరబోకు మెపుడు మేరమీరిన కోర్కె
చేరబోకు మెపుడు కౄరజనుల
మీరబోకు పెద్దవారు చెప్పినమాట
లలితసుగుణజాల! తెలుగుబాల!! 95

ప్రార్థనముల, పుణ్యతీర్థంబులందున,
గురులయందు, వైద్య వరులయందు,
భావమెట్టి దట్టి ఫలితంబు ప్రాప్తించు,
లలితసుగుణజాల! తెలుగుబాల!! 96

ఆకసమున మిత్రుడరుదెంచి నంతనే
సరసిలోని నళిని శిరసు నెత్తు
అమలమైన మైత్రి కవరోధములు లేవు
లలితసుగుణజాల! తెలుగుబాల!! 97

సాధుజనుల మానసము నారికేళంబు
పైన మిగులగట్టి, లోన మృదువు
బాలిశుల మనమ్ము బదరీఫలమ్మురా
లలితసుగుణజాల! తెలుగుబాల!! 98

మనసు, మధుకరంబు, మద్యంబు, మత్స్యంబు,
మదము, మర్కటంబు, మారుతంబు
చంచలంబు లివ్వి, సప్తమకారముల్
లలితసుగుణజాల! తెలుగుబాల!! 99

జనని, జన్మభూమి, జనకుండు, జాతీయ
కేతనంబు, జాహ్నవీతటంబు
పరమపావనములు పంచజకారముల్
లలితసుగుణజాల! తెలుగుబాల!! 100
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

గ్రహం అనుగ్రహం | రాశిఫలం | శంకరమంచి శివసాయి శ్రీనివాస్ | డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్
8143123549

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu#మేషం తలచిన కార్యాలను పూర్తి చేస్తారు. పెద్దల సహాయం అందుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. సంతోషకరంగా కాలం గడుపుతారు. ధర్మసిద్ధి ఉంది. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.
.
శుభకాలం ప్రారంభమైంది. లక్ష్యాలు నెరవేరుతాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీ మీ రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఆర్ధికంగా బలపడతారు. గతంలో పూర్తికాని ఒక పని ఇప్పుడు పూర్తవుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆనందోత్సాహాలతో కాలం గడుస్తుంది. వారం మధ్యలో ఒక శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. గిట్టని వారి జోలికి పోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన శుభప్రదం.
#వృషభం మధ్యమ ఫలితాలు ఉన్నాయి. తోటివారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వెంకటేశ్వరస్వామి సందర్శనం ఉత్తమం.
శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. శక్తివంచన లేకుండా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలి. ముఖ్యమైన విషయాల్లో సమాచార లోపం లేకుండా చూచుకోవాలి. అవసరానికి వాడుకునేవారుంటారు. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రశాంతమైన ఆలోచనలతో గొప్పవారవుతారు. మాట విలువను కాపాడుకోవాలి. పనిలో శ్రమ పెరుగుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరుగుతాయి. వారం మధ్యలో మంచి వార్తలు వింటారు. ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
   #మిథునం మిశ్రమ కాలం. కాలానుగుణంగా ముందుకు సాగండి. ముఖ్య విషయాల్లో తోటి వారి సహకారం తీసుకోండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. శ్రీ వెంకటేశ్వర‌ స్వామి ఆరాధన శుభప్రదం.
వృత్తి, ఉద్యోగాల్లోని వారికి శుభకాలం. అసాధారణ పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. కీలక వ్యవహారాల్లో సూటిగా ముందుకుసాగండి. ఊహించిన ఫలితాలు అందుకుంటారు. దుష్టులకు దూరంగా ఉండండి. అనవసర విషయాల్లో కలుగచేసుకోకుండా ఉండటం మంచిది. ప్రయాణాలు ఫలిస్తాయి. ఈశ్వరారాధన శుభప్రదం.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#కర్కాటకం ఊహించిన ఫలితాలు వస్తాయి. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. సాయినామాన్ని జపించాలి.

మంచి సమయం. మొదలుపెట్టిన పనులను బుద్ధిబలంతో చక్కగా పూర్తి చేయగలుగుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి. పై అధికారుల అండదండలు ఉంటాయి. వ్యాపారంలో ఆర్ధికాభివృద్ధి సాధిస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసాన్ని పెంచుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

  #సింహం తోటివారితో ఆనందంగా గడుపుతారు. కుటుంబం సభ్యులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరమైన నిర్ణయాలతో గొప్ప ఫలితాలు అందుకుంటారు. అంతా శుభమే జరుగుతుంది. ఇష్టదైవారాధన శుభప్రదం.
మొదలుపెట్టిన పనులలో ఇబ్బందులను అధిగ‌మిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఊహించిన ఫలితాలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆచి తూచి వ్యవహరించాలి. ఒక సంఘటన ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణ సౌఖ్యం కలదు. లక్ష్మీ స్తోత్రాన్ని చదవాలి .
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#కన్య  మంచి కాలం. చేపట్టే పనుల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్ధికయోగం శుభప్రదం. శివ నామస్మరణ ఉత్తమం, చదవడం శుభదాయకం.
మనోధైర్యంతో ముందుకు సాగి సత్ఫలితాలు సాధిస్తారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం అందుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. సూర్యాష్ట‌కం చదివితే మంచిది.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

#తుల‌ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. గిట్టనివారి మాటలను పట్టించుకోకండి. బంధుమిత్రులను కలుపుకొనిపోతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని ఇస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
సంపూర్ణ మనోబలంతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. మీ స్వధర్మం రక్షిస్తుంది. ఆపదలు దూరం అవుతాయి. ఒక ముఖ్య వ్యవహారంలో తోటి వారి సాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఆర్ధికంగా సత్ఫలితాలు ఉన్నాయి. అనుకున్న పని నెరవేరుతుంది. ఆటంకాలు కలుగకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. శ్రీ లక్ష్మీ గణపతి సందర్శనం శుభప్రదం.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#వృశ్చికం ఏకాగ్రత సడలకుండా పనిచేయాలి. స్థిర నిర్ణయాలు పనిచేస్తాయి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు అవసరం అవుతాయి . ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. శత్రువులు మిత్రులవుతారు. విష్ణు సహస్రనామావళి చదవాలి.
వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీ అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్య వ్యవహారంలో సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు మనోవిచారాన్ని కలిగించే విధంగా ఉంటాయి. అనవసర వివాదాలలో తలదూర్చకండి. మంచి మనస్సుతో ముందుకు సాగండి. కష్టాలు తగ్గుతాయి. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.

sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#ధనుస్సు మనోబలంతో చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు వల్ల‌ ఇబ్బందులను ఎదుర్కొంటారు. శనిధ్యాన శ్లోకం చదవండి.
మీ మీ రంగాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి. నిదానంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి. శత్రువులు మిత్రులవుతారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. ఆర్థికంగా గతంలో క‌న్నా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. అధికారులను మెప్పించడానికి కాస్త ఎక్కువ శ్రమపడాల్సి వస్తుంది. బంధుమిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రీ రామ నామస్మరణ ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu

#మకరం తలపెట్టిన పనిలో విజయం చేకూరుతుంది. ఉద్యోగంలో పురోగతి ఉంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంది. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ఇష్టదైవ ప్రార్థ‌న‌ మరింత మేలు చేస్తుంది.
మీ మీ రంగాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ముఖ్య విషయాల్లో జాప్యం వద్దు. ఒకటి ఊహిస్తే మరొకటి అవుతుంది. చెడు ఆలోచనలను దరిచేరనీయకండి. మనః శాంతిని తగ్గించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. ఎవ్వరితోను వాదోపవాదాలు చేయకండి. తగాదాలు అయ్యే సూచనలు ఉన్నాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అధికారులతో అతి చనువు వద్దు. అనవసర ఖర్చులు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. నవగ్రహ ఆలయ సందర్శనం శుభ ఫలితాన్ని ఇస్తుంది.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#కుంభం కీలక పనుల్లో నిదానంగా వ్యవహరించండి. కంగారు వద్దు. ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువుల వ‌ల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. ఇష్టదైవారాధన శుభప్రదం.
మంచి ఆలోచనలతో చేసే పనులు ఫలిస్తాయి. మొదలుపెట్టిన పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ముందస్తు ఆలోచనా విధానంతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి సాయం చేసేవారున్నారు. కీలక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. కొన్ని పరిస్థితులు బాధ‌ కలిగిస్తాయి. ఆరోగ్య సంరక్షణ అవసరం. ఇష్టదేవతా ధ్యానం శుభదాయకం.
sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly sankaramanchi ramakrishna Grahabalam RasiPhalalu Sunday-Magazine Eenadu.net EenaduEpaper EenaduSunday మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) వృషభం (కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) కర్కాటకం (పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) కన్య  (ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) వృశ్చికం (విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) మకరం (ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) కుంభం (ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) మీనం (పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) గ్రహం అనుగ్రహం | రాశిఫలం | Graham Anugraham | Rasifalam | eenadu | sankaramanchi ramakrishna sastry rasi phalalu weekly | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | శంక‌ర‌మంచి శివ‌సాయి శ్రీనివాస్, డా॥ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి bhaktipustakalu
#మీనం మంచి కాలం. ముందుచూపుతో వ్యవహరించి మంచి పేరు సంపాదిస్తారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. సౌభాగ్యసిద్ధి ఉంది. మనస్సౌఖ్యం ఉంది. ఇష్టదైవ నామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.
శుభకాలం. మొదలుపెట్టిన పనిలో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధిస్తారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. ధనలాభం ఉంది. వ్యాపారంలో ఆర్ధికాభివృద్ధి అందుకుంటారు. విందు వినోదాల్లో సంతోషంగా గడుపుతారు. నూతన కార్యాలు ప్రారంభించే ముందు సాధ్యసాధ్యాలను దృష్టిలో పెట్టుకొవాలి. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిరచిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రయాణ అనుకూలత ఉంది. ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం.
BHAKTHI BHAKTI BHAKTIBOOKS BHAKTHIBOOKS bhaktipustakalu

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

రాజయోగ రత్నావళి 
 Rajayoga Ratnavali 
Rs 120/-
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

నాన్ వెజ్ వంటలు | Nonveg Vantalu | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

నాన్ వెజ్ వంటలు 
 Nonveg Vantalu
Rs 108/-

ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

 ముహూర్త వల్లరి | Muhurtha Vallari | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
 ముహూర్త వల్లరి
  Muhurtha Vallari 
Rs 250/-

    జ్యోతిషశాస్త్రములో ప్రముఖమైనది ముహూర్తభాగము. ఈ దేశములో దాదాపు అందరు ఏ పని ప్రారంభించడానికైనా మంచి ముహూర్తము కొరకు సంప్రదించడము తెలియని విషయముకాదు. పూర్వ ఋషుల అభిప్రాయము ప్రకారము దుఃఖమును తరించుటకు, సుఖమును పొందుటకు యజ్ఞయాగాదులు, జపతపాదులు ఫలసిద్ధి కారి యగు కాలమున ఆచరించవలెను.
    ఆ ఫలసిద్ధియగు కాలమే ముహూర్తము. వేదకాలము నుండి నారదాది మహాఋషులు ద్రష్టలై, స్రష్టలై అనేక సంహింతలను రచించారు. వాటిలో ముహూర్త విషయాలు చర్చించబడినాయి. మరి ఈ ముహూర్త వల్లరి ప్రయోజనము ఏమని ప్రశ్నవచ్చును. సంహితలయందు నారదాది ఋషులచే చెప్పబడిన విషయములను, ముహూర్త చింతామణి, కాలామృతాది గ్రంథముల యందు చెప్పబడిన విషయములను క్రోడీకరించి, తార్కికమైన క్రమమున సామాన్యులకు కూడా అర్థ మగునట్లు వివరించు ప్రయత్నమే ఈ రచన. 

 ముహూర్త వల్లరి | Muhurtha Vallari | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి

మార్షల్ ఆర్ట్స్ | కరాటే | కుంగ్ ఫూ | జూడో | Martial arts | Karate | Kung Fu | Judo | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

మార్షల్ ఆర్ట్స్ 
కరాటే | కుంగ్ ఫూ | జూడో
  Martial arts 
 Karate | Kung Fu | Judo 
Rs 108/-
ఈ పోస్ట్ మీకు నచ్చినట్లయితే
మీ స్నేహితులకు SHARE చెయ్యండి